అదే పనిగా బీర్లు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. మీరు ఈ ప్రమాదంలో పడినట్టే!

ఈ మధ్య కాలంలో బీర్లు తాగే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కొంతమంది ఈ అలవాటును మార్చుకోలేకపోతున్నారు. యువతలో చాలామంది బీర్ల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. యువత ఎక్కువగా బీర్లు తాగడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. బీర్లు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా? అనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.

బీర్లు ఎక్కువగా తాగడం వల్ల ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు పాడయ్యే అవకాశాలు సైతం ఉంటాయి. అందువల్ల మద్యానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బీర్లు ఎక్కువగా తాగితే కాలేయం కొవ్వుగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

మద్యానికి బానిసైన వారికి నిద్రలేమి సమస్యలు సైతం వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. మద్యం ఎక్కువగా తాగేవాళ్లు అలసట, మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. బీరులో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. బీర్లు ఎక్కువగా తాగితే గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం కూడా కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.

మద్యం అతిగా సేవిస్తే అది మెదడు కణాలను నాశనం చేయడంతో పాటు మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మెదడు కణాలు దెబ్బతినడంతో జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. బీర్లు ఎక్కువగా సేవిస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అనేక రకాల సమస్యల బారిన పడతారు. మద్యం అతిగా సేవిస్తే కుటుంబం, స్నేహితులు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.