నేటితరం పిల్లల్లో చాలామంది సరైన బరువు పెరగకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా చిన్న పిల్లల కడుపులో నులి పురుగులు తయారు కావడంతో పాటు ఈ పురుగులు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశాలు అయితే ఉంటాయి. నులి పురుగులు పిల్లల కడుపులో చేరడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, సరిగా తినకపోవడం, వాంతులు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పిల్లల పొట్టలో నులి పురుగులు ఉంటే ఎదుగుదల ఆగిపోవడం, ఆకలి మందగించడం, రక్తహీనత, నీరసం, బలహీనత, తీవ్రమైన కడుపునొప్పి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నులిపురుగుల వల్ల కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం లాంటి సమస్యలు వస్తాయి. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేని పక్షంలో నులిపురుగుల సమస్య వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
కాచి చల్లార్చిన నీటిని మాత్రమే పిల్లలకు తాగించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. భోజనానికి ముందు పిల్లల చేతులు తప్పని సరిగా శుభ్రం చేసుకునేలా చేయడంతో పాటు చెప్పులు లేకుండా పిల్లలను ఆడుకోవడానికి పంపించకూడదు. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా నులిపురుగులు దూరమవుతాయి. కడుపులో నులి పురుగులు ఉంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న ఒకటి రెండు రోజుల తర్వాత మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి.
ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు వాడటం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ట్యాబ్లెట్లు వాడినా ఫలితం లేకపోతే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. నులి పురుగుల సమస్య వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.