మన పిల్లలు జీవితంలో పైకి రావాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం అని చెప్పాలి. పిల్లల విషయంలో తల్లి ఎప్పుడూ పిల్లలకు ప్రేమ చూపిస్తుంది. అలాగే క్రమ శిక్షణ విషయలో తండ్రికి చాలా బాధ్యత వుంది. ఒక ఇరవై ఏళ్ల కిందట తండ్రి ఇంట్లోకి వస్తున్నాడు పిల్లలు అల్లరి పనులు ఆపి బుద్దిగా చదువుతూ వుండేవారు. కాని ప్రస్తుతం తండ్రి బాధ్యతలు మారాయి. కాలంతో పాటు తండ్రి పాత్ర కూడా మారింది మారాలి కుడా. ఇప్పటి రోజుల్లొ భయ పడితే బాగు పడటం లేదు. తండ్రి ఎలావుంటే పిల్లలు భవిష్యత్ బాగుంటుందో తెలుసుకుందాం.
మీ పిల్లలతో వుండే సమయం కచ్చితంగా పెరగాలి. మీరు ఎలాంటి పనులలో బిజీగా ఉన్న పిల్లల కంటూ కొంత సమయం కేటాయించాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసులో ఒత్తడి పని విషయాలను ఇంటి వరకు తీసుకోవచ్చు ఆ కోపం పిల్లలపై చూపించకూడదు. మీకు ఎన్ని టెన్షన్ ఉన్న బయటి వాటిని వదిలి మీ పిల్లలకు మొదటి రోల్ మోడల్ వారి తండ్రేఅనే విషయాన్ని గుర్తించేలా మీరు పిల్లలతో ప్రవర్తించాలి. పిల్లల ముందు నిజాయితీగా ఉండండి. సిగరెట్, మందు తాగడం పిల్లల ముందు అస్సలు చేయవద్దు.
మీరు మీ ప్రేమ చూపిస్తు స్నేహితుడులా వుండాలి. ఏ విషయం ఆయినా కూడా మీతో పంచుకునే స్వేచ్చ వారికి వుండాలి. అది తప్పు అయినా ఒప్పు ఆయినా కూడా
పిల్లలు ఏది చెప్పినా విసుక్కోకుండా వారు చెప్పేది వినే ప్రయత్నం చేయండి.పిల్లలు అల్లరి చేసినా వారిపై అరవటం, కొట్టడం చేయొద్దు. వారికి ఎలా వుండాలి అని చెప్పాలి. బాగా చిన్న తనం లో కొంచెం పెంకి తనం వుంటుంది, అప్పుడే ఓపికగా వుండాలి.అలాగే నెలకు ఒకసారి అయినా పిల్లలను సరదాగా బయటకు తీసుకు వెళుతూ వారితో స్నేహపూర్వకంగా మెలగాలి అప్పుడే పిల్లల దృష్టిలో మీరు ఒక మంచి తండ్రి బాధ్యతగల తండ్రిగా ఉంటారు.