తేనెతో వేసుకునే ఈ ఫేస్ ప్యాక్ తో అందమైన చర్మం మీ సొంతం..?

Honey-tea-for-a-sore-throat

ప్రస్తుత కాలంలో అందంగా కనిపించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు, లేదంటే బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. అయితే వేల రూపాయలు ఖర్చు చేసి ఇలా బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి బదులు స్వచ్ఛమైన తేనెను ఉపయోగించి మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. స్వచ్ఛమైన తేనెతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం వల్ల అందమైన, మృదువైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. అయితే తేనెతో వేసుకుని ఈ పేస్ ప్యాక్ ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* తేనె, నిమ్మరసం ఫేస్ ప్యాక్ :
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి రెండింటిని బాగా కలపాలి. ఆ తర్వాత మొహం శుభ్రంగా కడుక్కొని ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ పై రాసి 15 నుండి 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల చర్మం నిగారించడమే కాకుండా మృదువుగా తయారవుతుంది.

* పాలు, తేనె ఫేస్ ప్యాక్: ఒక బౌల్ తీసుకొని అందులో
2-3 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు , సమాన పరిమాణంలో తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మెడ మీద చేతి వేళ్ళతో బాగా మర్దన చేయాలి. ఇలా 15- 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత గౌరవెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేయటం వల్ల చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.

* తేనె, అలోవెరా, దాల్చిన చెక్క ఫేస్ మాస్క్ :
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చి తేనె, 1 టేబుల్ స్పూన్ కలబంద, 1/4 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపండి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖం మీద ఫేస్ ప్యాక్ లా అప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.