తరచూ కలలో నీళ్లు కనిపిస్తున్నాయా… ఇది దేనికి సంకేతమో తెలుసా?

సాధారణంగా పగలు లేదా రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణం అయితే ఇలా కలలు రావడం వల్ల చాలామంది ఆ కలలో నిజజీవితంలో జరుగుతాయి అని భయపడుతూ ఉంటారు అలాగే మరికొన్ని కలలో నిజజీవితంలో జరిగితే చాలా బాగుంటుంది అని కూడా అనుకుంటారు. అయితే మన భవిష్యత్తులో జరగబోయేది ఇలా కలల రూపంలో ముందుగా మనకు తెలుస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది.ఇలా ఎన్నో రకాల వస్తువులు జంతువులు కొన్ని సంఘటనలు మనకు కలలో కనపడుతూ ఉంటాయి.

ఈ విధంగా చాలామంది పడుకున్న సమయంలో వారి కలలో తరచూ నీళ్ళు కనపడుతూ ఉంటాయి.ఏదైనా నీటి ప్రవాహం లేదా నీళ్లలో పడి కొట్టుకుపోతున్నట్లు ఇలాంటి కలలు తరచూ వస్తూ ఉంటాయి. అయితే ఇలా తరచు కలలో నీళ్లు కనబడటం దేనికి సంకేతం ఇది శుభ సూచికమైన లేక ఏదైనా అశుభాన్ని కలిగిస్తుందా అనే విషయానికి వస్తే… మీకు కనుక నదిలో నీరు ప్రవహిస్తున్నట్టు కనక కనపడితే చాలా మంచి జరగబోతుంది అని అర్థం.ఇక బావిలో స్థిరంగా ఉన్న నీరు గనక కలలో కనపడితే మీకు త్వరలోనే మంచి జరగబోతుందని డబ్బు ప్రాప్తి కలగబోతుందని అర్థం.

ఎవరైనా తన కలలో స్వచ్ఛమైన నీటిని చూస్తే, అతని జీవితం మారబోతోందని అర్థం చేసుకోండి. ఇలాంటి కలలు రావడం వల్ల వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇక కలలో కనక వర్షం కురుస్తున్నట్టు కనపడితే భవిష్యత్తులో విజయాన్ని పొందబోతున్నారని, త్వరలో మీకు కొన్ని శుభ అందుతాయని చెబుతుంది. ఇక కలలో బురద నీళ్లు మురికి నీళ్లు కనుక కనబడితే
మీకు పెద్ద నష్టాన్ని సూచిస్తుంది. రాబోయే రోజుల్లో మీ జీవితం అస్తవ్యస్తంగా మారుతుందని అర్థం. కలలో సముద్రపు అలలు కనక ఎగసిపడుతున్నట్టు కనపడితే
రాబోయే రోజుల్లో మీరు మీ మాటలను నియంత్రించాలని చెబుతుంది. దీని కారణంగా, మీకు తగాదాలు పెరగవచ్చు.