మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు చేసి దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం . అయితే ఈ పూజా కార్యక్రమంలో దేవుడికి పువ్వులు పొలాలు నైవేద్యాలు సమర్పించడం ఎంత ముఖ్యమో కొబ్బరికాయ కొట్టడం కూడా అంతే ముఖ్యం . అందుకే మనం ఏదైనా ఆలయానికి వెళ్ళిన తప్పనిసరిగా భగవంతుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము ఇక ఇంట్లో ఏదైనా పండగలు ప్రత్యేక దినాలలో కూడా కొబ్బరికాయ కొడుతూ ఉంటాము.
మన హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత చివరగా కొబ్బరికాయ కొడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరి నీరు చంద్రునికి చిహ్నంగా భావిస్తారు. దానిని దేవునికి సమర్పించడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఇలా పూజ ముగిసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం వల్ల మన జీవితంలో దుఃఖం బాధలను దూరం చేస్తుంది. ఇలా ఎంతో విశిష్టత కలిగిన కొబ్బరికాయను మహిళలు కొట్టకూడదని చెబుతారు. పూజ అలంకరణ మొత్తం మహిళ చేసినప్పటికీ కొబ్బరికాయ మాత్రం పురుషులు కొట్టాలని చెబుతారు ఇలా మహిళల కొబ్బరికాయ కొట్టడానికి ఎందుకు నిషేధం అనే విషయానికి వస్తే…
మహిళలు ఒక ప్రాణం భూమి మీద రావటానికి ఎలా కారణం అవుతారో కొబ్బరికాయ కూడా ఒక చెట్టు జన్మించడానికి అలాగే కారణం అవుతుంది. అందుకే మహిళలు ఎప్పుడు కొబ్బరి కాయను పగలగొట్టారు. మహిళలు కొబ్బరి కాయలు పగలగొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల మహిళలు కొబ్బరికాయ కొట్టడం హిందూ శాస్త్రంలో నిషేధించబడింది. అంతేకాకుండా పురాణాల ప్రకారం విష్ణువు మరియు లక్ష్మీ దేవి భూమి పై కొబ్బరికాయ చెట్లను నాటినట్లు శాస్త్రం చెబుతోంది. అందువల్ల కొబ్బరికాయను పరమ పవిత్రంగా భావించి పూజలో ఉపయోగిస్తారు. అలాగే మనమందరం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కలశం మీద కొబ్బరికాయను ఉంచి పూజిస్తారు.