సాధారణంగా భార్యాభర్తల మధ్య జీవితం అన్యోన్యంగా ఉండాలంటే వారి మధ్య లైంగిక జీవితం బాగున్నప్పుడే వారి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది అయితే పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు లైంగిక జీవితంలో చాలా ఆసక్తిగా పాల్గొన్నప్పటికీ ఫోను పోను మహిళలలో శృంగారంలో పాల్గొనాలంటే పూర్తిగా ఆసక్తి తగ్గుతుంది ఇలా మహిళల శృంగార కోరికలు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి మహిళలలో శృంగార కోరికలు తగ్గడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
మహిళలు కుటుంబ కార్యకలాపాలను సరిదిద్దె క్రమంలో కొన్నిసార్లు అధిక ఒత్తిడికి గురవుతారు. ఇలా అధిక ఒత్తిడికి గురైన సమయంలో వారు సెక్స్ లో పాల్గొనాలంటే ఏ మాత్రం ఆసక్తి చూపించరు. ఇలా ఆసక్తి లేని సమయంలో పురుషులు వారిని ఇబ్బంది పెట్టకూడదు.వారిని కాస్త సరదాగా బయటకి తీసుకువెళ్లడంతో వారిలో ఉన్న ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది.
ఇక సెక్స్ చేసే సమయంలో మహిళలలో తీవ్రమైన నొప్పి కారణంగా కూడా శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు.సాధారణ కారణాలలో పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఇది పెల్విస్ బేస్‌లోని కండరాలు విశ్రాంతి తీసుకోనప్పుడు జరుగుతుంది. మీకు చెమట ఎక్కువగా ఉంటే లేదా నోటి దుర్వాసన ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా.. దుర్వాసన కారణంగా మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. శృంగారంలో పాల్గొన్నప్పుడు ముగింపులో లైంగిక సంతృప్తి లేనప్పుడు, మహిళలు ఆసక్తిని కోల్పోతారు. అందుకే మహిళలు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు.