విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులకు మద్యం ఎందుకు ఇస్తారో తెలుసా?

విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు ఏ విధమైనటువంటి అంతరాయాలు ఇబ్బందులు తలెత్తకుండా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అన్ని సదుపాయాలను సమకూరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రయాణికులకు సమయానికి ఆహార సదుపాయాలు అందించడమే కాకుండా మద్యం కూడా అందిస్తోంది. అయితే చాలామంది మద్యం సేవించి కొన్నిసార్లు విమానయాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తోటి ప్రయాణికుల పట్ల కూడా ఎంతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఇబ్బందులను కలిగించేలా ఉన్నప్పటికీ విమానంలో ప్రయాణికులకు ఎందుకు ఆల్కహాల్ ఇస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు.

విమానాల్లో ఉన్న అనర్థాలకు కారణమైన మద్యాన్ని నిషేదించకుండా.. ఎందుకు ప్రయాణికులకు అందిస్తున్నారు? అని అనుమానం కలుగవచ్చు.
మద్యం వల్ల విమాన ప్రయాణాల్లో ఇన్ని గొడవలు అవుతున్నా కూడా అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు మద్యాన్ని సరఫరా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… అంతర్జాతీయ విమానాల్లో మద్యం సరఫరా చేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒక దేశం నుండి మరొక దేశానికి సుదూర ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండడం కోసమే ఆహారం, మద్యం వంటివి సరఫరా చేస్తారు. అంతేకాకుండా విమానాల్లో మద్యం సరఫరా చేయటం వల్ల మద్యం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.

విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు తాగి ఈ మద్యం ఖర్చుని విమానయాన సంస్థలు టికెట్ తో పాటే వసూలు చేస్తారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ప్రయాణంలో బోర్ కొట్టకుండా మద్యం తాగి చాలామంది నిద్రలోకి వెళ్లిపోతారు. అందుకే విమానాలలో ప్రయాణం చేసే వారికి మద్యం సరఫరా కూడా చేస్తూ ఉంటారు.