మన సనాతన భారతదేశంలో హిందువులు ఎన్నో రకాల సంస్కృతి సాంప్రదాయాలను పాటించడమే కాకుండా ఆచార వ్యవహారాలను కూడా ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ప్రతిరోజు భగవంతుడిని స్మరించడం వల్ల తమకు ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవని భావించి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దేవుడి ముందు తప్పనిసరిగా దీపం వెలిగించి దైవాన్ని పూజిస్తూ ఉంటారు.అయితే ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి సమయంలో దీపానికి నెయ్యి ఉపయోగించాలా లేక నూనె ఉపయోగించాలో తెలియక చాలా మంది సతమతమవుతూ ఉంటారు.
సాధారణంగా చాలామంది నూనెతోనే దీపం వెలిగిస్తారు అయితే దేనితో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది అనే విషయానికి వస్తే…హిందువులు దేవుడి ముందు నెయ్యి, నూనె తో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దేవుడికి కుడి వైపున నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడు అది మీ ఎడమ చేతి వైపు ఉంటుంది. ఇక నూనె దీపం విషయం వస్తే నువ్వుల నూనె దీపాన్ని దేవుడికి ఎడమ వైపు అంటే మీకు కుడి వైపున వెలిగించాలి. దేవతలకు నెయ్యి దీపాలను వెలిగిస్తారు.
ఇక ఏదైనా కోరికలు కోరుకొని దేవుడికి దీపారాధన చేయాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక దీపాలను మన అవసరానికి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు దీపాలను వెలిగించుకోవచ్చు. ఇంటి వాస్తులో అగ్ని మూలకం బలపడుతుంది. ఇంట్లో కానీ లేదంటే గుడిలో కానీ దీపం పెట్టేటప్పుడు ఎక్కువ మొత్తంలో నెయ్యి లేదా నూనె వేయాలి. అలాగే నిత్య దీపారాధన వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.