దీపం కొండెక్కిన.. ఆరిపోయిన జరిగే పరిణామాలు ఏంటో తెలుసా?

పూజకు ముఖ్య ఆధారం దీపారాధన. అటువంటి దీపం ఆరిపోవడం, కొండెక్కడం లాంటిది జరిగినప్పుడు చాలా అనర్థాలు చోటు చేసుకుంటాయనిది పురాణాల ప్రకారం వాస్తవం. దీపం వెలిగించడంలో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఫలితం పొందగలము లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సిందే.

దీపాన్ని ఉదయం అయితే ఐదు గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే వెలిగించాలి. అదే సాయంత్రం అయితే ఐదు నుండి 7 గంటల లోపు మాత్రమే వెలిగించాలి. ఏవైనా ప్రత్యేక పూజలు ఉంటేనే రాత్రిపూట వెలిగించాలి. ఇక మిగతా సమయాలలో దీపం వెలిగించడం అంత మంచిది కాదు.

దీపానికి ఆవు నెయ్యి శ్రేయస్కరం, అది లేని పక్షంలో ఆముదం లేదా నువ్వుల నూనెను విరివిగా ఉపయోగించవచ్చు. వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడకపోవడం మంచిది. దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని ఎట్టి పరిస్థితులలోనూ దక్షిణ దిశలో ఉంచరాదు. అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉంచినట్లయితే ఆ ఇల్లు సిరిసంపదలు, సుఖశాంతులతో వెలుగుతుంది.

దీపాన్ని నేలపై కాకుండా ఏదైనా ఆకులో లేదంటే ఒక ప్లేట్లో పెట్టి అందులో ఒక నాణ్యాన్ని వేయాలి. దీపం ఆరిపోకుండా, కొండేక్కకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో చిన్న పిల్లలకు ఏదైనా దిష్టి లాంటిది తగిలితే ఆ నానాన్ని పిల్లలకి స్నానం చేపించే నీళ్లలో వేసి ఆ నీళ్లతో స్నానం చేపిస్తే దిష్టి వదులుతుంది.

దీపాన్ని ఉదయం, సాయంత్రం కచ్చితంగా శుభ్రం చేసుకుని కొత్త వత్తులని వెలిగించాలి. అప్పుడే ఆ పూజ పరిపూర్ణం అవుతుంది. పూజ చేసేటప్పుడు దీపం మనకు ఎడమవైపుగా ఉండేటట్టు చూసుకోవాలి. దీపారాధనకు ఉపయోగించే కుందలు విరిగినవి, పాడైపోయినవి, ఇలాంటి లోపాలు ఉంటే వాటిని వాడకూడదు. కుందలు ఇత్తడి, రాగి లేదా మట్టితో చేసిన పర్వాలేదు వాడుకోవచ్చు.

ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని దీపం వెలిగించినట్లయితే ఎటువంటి హానీ కీడు లేకుండా ఆ కుటుంబం అంతా సంతోషంగా ఇంకా సిరిసంపదలతో ఆనందంగా జీవిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది.