Rajamouli: మహేష్ పాస్ పార్టీ సీజ్ చేసిన జక్కన్న… మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మహేష్!

Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసినదే. గత సంవత్సర కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి రాజమౌలి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఏ విషయం బయటకు రాకుండా షూటింగ్ జరుపుతున్నారు.

ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్నప్పటికీ ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను మాత్రం బయటకు లీక్ చేయలేదు. ఇక మహేష్ బాబు కూడా తరచూ బయట కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదా అనే సందేహం కూడా ప్రతి ఒక్క అభిమాని లోను కలిగింది అయితే ఈ సందేహాలకు రాజమౌళి చెక్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు ఈ వీడియోలో భాగంగా ఒక సింహాన్ని జైల్లో బంధించి ఆ సింహం ముందు ఈయన పాస్ పోర్ట్ చేతిలో పట్టుకొని కనిపించారు ఇక ఈ వీడియోని షేర్ చేసిన రాజమౌళి క్యాప్చర్డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా రాజమౌళి చేతిలో పాస్ పోర్ట్ ఉండటంతో కచ్చితంగా ఇది మహేష్ బాబుది అయ్యి ఉంటుందని అభిమానులదరూ కూడా భావించారు.

ఈ విధంగా రాజమౌళి చేసిన ఈ పోస్ట్ పై మహేష్ బాబు తో పాటు నటి ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ప్రియాంక చోప్రా ఈ పోస్టుపై స్పందిస్తూ ఫైనల్లీ అంటూ రిప్లై ఇచ్చింది. మరోవైపు మహేష్ బాబు కూడా స్పందిస్తూ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి సినిమాలోని డైలాగ్ ద్వారా రిప్లై ఇచ్చారు. అయితే మహేష్ బాబు సినిమా షూటింగ్లో ఏ మాత్రం విరామం దొరికినా వెంటనే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారు. ఇకపై అలా వెళ్లడానికి కుదరదని రాజమౌళి చెప్పకనే చెప్పేశారు. ఇలా ఈ వీడియోని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు.