ఆలయంలో తీర్థం తీసుకున్న తర్వాత చేతులను తలకి తుడుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రజలందరూ ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అనేకమంది ప్రతిరోజూ ఉదయం ఇంట్లో పూజ ముగిసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత పూజారి ఇచ్చే ప్రసాదాన్ని, తీర్థాన్ని తీసుకుంటారు. అయితే చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత తమ చేతులను తలకి తుడుచుకుంటారు. సాధారణంగా అరచేతిలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ తీర్థాన్ని మన పెదవులకు దంతాలకు తాకకుండా నాలుగు మీద వేసుకొని సేవించాలి.

ఒకవేళ ఆ తీర్ధం పెదవులకు తగిలితే అది ఎంగిలి తీర్థంగా మారుతుంది. అలాగే తీర్థం తీసుకున్న తర్వాత చేతులను తలకి తుడుచుకోవడం వల్ల దోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల చేతితో తీర్థం తెలుసుకున్న తర్వాత చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే ఒకవేళ దేవాలయంలో చేతిని నీటితో క‌డుక్కునే వీలు లేని వారు తీర్థం తీసుకునేట‌ప్పుడే కండువ లేదా రుమాలును నాలుగు మ‌డ‌త‌లుగా మ‌డిచి రెండు చేతుల మ‌ధ్య‌లో ఉంచి తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థం తీసుకున్న త‌రువాత చేతిని కండువా లేదా రుమాలుకు తుడుచుకోవాలి.

ఇక మహిళలు తీర్థం తీసుకున్న తర్వాత వారి చేతులను కొంగుకు తుడుచుకోవాలి. అంతేకానీ తలకి తలుచుకోవడం వల్ల దోషం ఏర్పడుతుంది. అయితే తీర్థం తీసుకున్న‌ త‌రువాత కండువాకు తుడుచుకోవ‌డం కూడా దోష‌మే అవుతుంది. కానీ మ‌నం ద‌ర్శ‌నం కోసం వ‌రుస‌లో నిల‌బడడం వ‌ల్ల చేతిని క‌డుక్కునే వీలు ఉండ‌దు క‌నుక చేతిని కండువాకు తుడుచుకోవాలి త‌ప్ప పొరపాటున కూడా త‌ల‌కు తుడుచుకోకూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు.