ప్రెగ్నెన్సీ సమయంలో కలయిక వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చిన వెంటనే పూర్తిగా తన భర్తను దూరం పెడుతూ తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా పెళ్లి తర్వాత చాలామంది భర్తతో కలవకూడదని ఆలోచనలో ఉంటారు.అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే కలయికకు దూరంగా ఉండాలి లేకపోతే ఆరోగ్య పరిస్థితి బాగున్న దంపతులు శృంగారానికి దూరంగా ఉండాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు నెలలు పూర్తి అయ్యేవరకు కూడా శృంగారంలో పాల్గొనవచ్చు ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇలా గర్భం దాల్చిన మహిళ తన భర్తతో శృంగారం చేయటం వల్ల తన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా యాంటీ బాడీల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇలా కలయిక కారణంగా జననేంద్రియాలలో కూడా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.చాలామంది గర్భం దాల్చిన సమయంలో వ్యాయామాలు చేసే శక్తి లేకపోతే అలాంటి వారు సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా క్యాలరీలు బర్న్ అవ్వడమే కాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.

గర్భధారణ సమయంలో భార్యాభర్తల శృంగారంలో పాల్గొనడం వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మన శరీరంలో ఎండార్పిన్ లు విడుదల కాగా ఇవి తల్లి బిడ్డను ప్రశాంతంగా ఉంచడానికి కారణమవుతుంది. ఈ సమయంలో మీరు ఉద్వేగం చెందినప్పుడు మీ కటి కండరాల సంకోచాన్ని ఆ భాగాలు బలోపేతం చేయటం వల్ల ప్రసవ సమయంలో అధిక నొప్పిని కలిగించదు అలాగే ప్రసవం అనంతరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.