షార్ట్ సర్క్యూట్స్ రావడానికి గల కారణాలు ఏంటి వాటిని ఎలా నివారించాలో తెలుసా?

ఈ ఆధునిక రంగంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో గృహోపకరణాలు ఉపయోగిస్తున్నారు.టీవీ నుంచి మొదలుకొని ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ డిష్ వాషర్ వంటి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం వల్ల విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఇంట్లో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్స్ ఏర్పడుతున్నాయని వార్తలను తరచూ వింటూ ఉన్నాం.అయితే ఇలా షార్ట్ సర్క్యూట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి ఎలా నివారించాలి అనే విషయానికి వస్తే…

మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే వస్తువులలో డివైజ్‌ల్లో ఆపరేటింగ్ కరెంట్ అనుకున్న యాంపియర్ల కంటే ఎక్కువ ఎక్కువగా ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే…

సాధారణంగా విద్యుత్‌ను యాంపియర్లలో కొలుస్తారని విషయం మనకు తెలిసిందే. అదే విధంగా పలు డివైస్ లపై ఆపరేటింగ్ కరెంట్ అని రాసి ఉంటుంది. ఇలాంటి వాటిలో అనుకున్న డెసిమల్స్ కన్నా ఎక్కువగా విద్యుత్ ప్రసారం జరిగితే వెంటనే అవి కాలిపోవడం ద్వారా ఇంట్లో ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఆపరేటింగ్ కరెంట్ 15 యాంపియర్ లు కాగా ఇంతకుమించి విద్యుత్ ప్రసారం జరిగితే షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది.ఒక ఎలక్ట్రిక్ సాకెట్‌లో మల్టీప్లగ్ పెట్టి పలు విద్యుత్ ఉపకరణాలను వినియోగిస్తే.. కరెంట్ లోడ్ అనేది అధికం అవుతుంది. అందుకే వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు స్విచ్ లను ఉపయోగించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.