ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు ఏమాత్రం ప్రాధాన్యత విలువ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వందేళ్లు భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండాల్సిన మహిళలు కొన్ని కారణాలవల్ల తన భర్త పిల్లలను దూరం పెడుతూ ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలా మహిళలు పురుషులు ఇద్దరూ కూడా ఇతర వ్యక్తులతో ఆక్రమ సంబంధం పెట్టుకుని ఉంటారు. ఇలాంటి అక్రమ సంబంధాల కారణంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.
ముఖ్యంగా మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…చిన్న వయసులోనే మహిళలకు పెళ్లి చేయటం వల్ల పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే చిన్న వయసులోనే పెళ్లి అంటేనే వారికి వారు చేసుకోబోయే వ్యక్తి సంపాదనగురించి తెలియకపోవటం వల్ల తల్లిదండ్రులు చెప్పిన వారిని పెళ్లి చేసుకుంటారు అయితే వారికి పెళ్లి వయసు వచ్చేసరికి తన భర్త సంపాదన ఎంత ఆయన సంపాదించేది ఎంతవరకు తన కుటుంబానికి సరిపోతుంది అనే విషయాల గురించి ఆలోచిస్తారు.
ఇలా భర్త సంపాదన సరిపోకపోవడంతోనే బాగా సంపాదించే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు అలాగే తన భర్త నుంచి తాను ఆశించిన విధంగా ప్రేమానురాగాలు లేకపోవడం వల్ల కూడా కొందరు మహిళలు ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. లేనిపోని కారణాలతో భర్తలు భార్యలను బాధ్యురాలిని చేసే తిట్టడం వంటివి చేయటం వల్ల ఇలా మహిళలు ఇతర వ్యక్తులకు దగ్గరవుతారని పలు సర్వేలు తెలియజేశాయి.