బంగారం ఉన్నవాళ్లకు శుభవార్త.. ఈ విధంగా అదనపు ఆదాయం పొందవచ్చట!

gold

మనలో చాలామంది ఇంట్లో బంగారాన్ని కలిగి ఉంటారు. ఎవరి ఆర్థిక స్థోమతకు అనుగుణంగా వాళ్లు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో బంగారాన్ని ఊరికే ఉంచడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందలేము. అయితే గోల్డ్ మానెటైజేషన్ స్కీమ్ ద్వారా వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది. గోల్డ్ డిపాజిట్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా సులభంగా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది.

ఆర్బీఐ ఈ స్కీమ్ కు సంబంధించి కొన్ని బ్యాంకులను సూచించింది. ఆ బ్యాంకులలో బంగారం డిపాజిట్ చేస్తే మాత్రం ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకు కావాలంటే అన్ని సంవత్సరాలకు బంగారం డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఎలాంటి లాకర్ ఛార్జీలు చెల్లించకుండానే సులువుగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

లాకిన్ పీరీయడ్ ఆధారంగా వడ్డీని పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 2.25 శాతం నుంచి ఈ వడ్డీ ఆరంభం అవుతుంది. ఈ వడ్డీ తక్కువ మొత్తమే అయినా ఊరికే బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి బదులుగా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బెనిఫిట్ ను పొందవచ్చు. కనీసం 10 గ్రాముల నుంచి ఎంత బంగారం అయినా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. బంగారం స్వచ్చత ఆధారంగా ఈ స్కీమ్ లో ఆ గోల్డ్ ను ఉంచాలో లేదో నిర్ణయిస్తారు.

ఒకవేళ అవసరం అనుకుంటే డిపాజిట్ చేసిన బంగారానికి వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ ను అందిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ బ్యాంక్ లలో బంగారాన్ని డిపాజిట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.