ఆలస్యం చేయకుండా ఈ పనులు చేయండి దరిద్రాన్ని తొలగించుకోండి!

మనిషి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. వెంటనే చేసే పనులు, తర్వాత చేసే పనులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే మన పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే ఏ పని నైనా సమయానికి చేసెయ్యాలి. ఉదాహరణకు భోజనం సమయానికి తింటే ఆరోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. 100 పనులు ఉన్న ఆపి భోజన సమయానికి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది.

ప్రతిరోజు కచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేస్తే శరీర అలసట, ఒత్తిడి తగ్గి నరాలు అనేటివి యాక్టివ్ గా ఉంటాయి. స్నానం చేసిన తర్వాత చెమట పడుతుంది. దాని ద్వారా మంచి ఉపసవనం లభిస్తుంది. చర్మ కణాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఒక సమయం కేటాయించి ఆ సమయంలో కంపల్సరిగా స్నానం ఆచరించాలి.

పూజ, ధ్యానం లాంటివి ఆలస్యం చేయకుండా ఎన్ని పనులున్నా సరే ఆపి ముందు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఇలా సమయానికి పనులు చేయడం వల్ల, బద్ధకం అనేది లేకుండా ఏ పనిని వాయిదా వేయకుండా చేసేయాలి.

ఉదయం సూర్యోదయం కంటే ముందు ఇంట్లో అందరూ లేచి, ఇంటిని చిమ్మి చక్కగా స్నానాలు చేస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో అన్ని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. చెత్త,బూజు, మురికి,పాచి ఉన్నట్లయితే అటువంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలవదు. మురికి బట్టలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఎప్పటికప్పుడు అంటే కనీసం రెండు మూడు రోజులకు ఓసారి అయినా బట్టలను ఉతికితే మంచిది.

మురికి బట్టలు ఉన్నచోట లక్ష్మీదేవి నిలవదు. మన మనసులో చెడు ఆలోచనలు ఉండకూడదు, స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. కానీ మనసును కూడా శుభ్రపరచుకుంటేనే అటువంటి వ్యక్తి దగ్గర లక్ష్మీదేవి నిలబడుతుంది. చెడు వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి ఎక్కువకాలం ఉండదు. లక్ష్మీదేవికి ఇంటి పరశుభ్రత, శరీర పరిశుభ్రతతో పాటు మానవుని మనసు కూడా పరిశుభ్రంగా మంచి ఆలోచనలతో నిండి ఉన్నట్లయితేనే వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.