ఆ గుడిలో డబ్బున్న వాళ్లైనా భిక్షమెత్తుకుంటారా.. ఆ దేవత మహిమ ఏంటంటే?

students-offer-prayers-to-goddess-saraswati-on-638588

మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు. ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భావనను మనలో చాలామంది కలిగి ఉంటారు. దేవుడిని ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కును వీలైనంత త్వరగా చెల్లించాలి. గుడికి వెళ్లడం వల్ల మనకు ప్రశాంతత లభిస్తుందనే సంగతి తెలిసిందే. గుడికి వెళ్లి ఏదైనా కోరికను భక్తితో కోరుకుంటే మెజారిటీ సందర్బాల్లో అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

 

అయితే మన సమస్య పరిష్కారం అయ్యాక దేవుడి గురించి చాలామంది ఆలోచించారు. సరైన సమయానికి తీర్చాల్సిన మొక్కులను వేర్వేరు కారణాల వల్ల వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయడం వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలు అన్నీఇన్నీ కావు. సరైన సమయంలో మొక్కులు తీర్చని పక్షంలో దేవుడు అనుకూల ఫలితాలు ఇవ్వడని కొంతమంది భావిస్తారు. ఎవరైతే మొక్కు తీర్చరో వాళ్ల పనులు అనుకున్న విధంగా జరగవు.

 

అదే సమయంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నగదు, బంగారం వేస్తామని హామీ ఇచ్చి ఆ మొక్కును నెరవేర్చకపోతే నెగిటివ్ ఫలితాలు కలిగే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మొక్కుబడులు సరిగ్గా తీర్చుకోకపోయినా కొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితాలను అయితే పొందలేమని చెప్పవచ్చు.

 

కొప్పవరం సత్తెమ్మ తల్లి కోరుకున్న ప్రతి కోరికను తీరుస్తుంది. కోరికలు తీరితే మాత్రం ఈ ఆలయంలో భిక్షం ఎత్తాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో బిచ్చెమెత్తుకున్న సందర్భాలు ఉన్నాయి.