ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లావాదేవీలనుచేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే పది రూపాయలను చెల్లించే నుంచి లక్ష రూపాయలు వరకు కూడా ఫోన్ పే గూగుల్ పే వంటి వాటి ద్వారా డబ్బును ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అయితే ఇలా డబ్బులు మరొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే క్రమంలో చిన్న పొరపాటు జరిగిన వెంటనే ఆ డబ్బు మనం పంపించాల్సిన వారికి కాకుండా వేరే వారి ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఇలా చాలామంది చాలాసార్లు ఈ పొరపాటు చేసే ఉంటారు.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్నవారు రాంగ్ యూపీఐ వల్ల ఒక అకౌంట్‌కు బదులు మరో అకౌంట్‌కు పొరపాటున డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే పొరపాటున ఇలా జరిగినప్పుడు ఆ డబ్బును ఎలా తిరిగి పొందాలో తెలియక చాలమంది నష్టపోతున్నారు. ఇలాంటి సందర్బంలో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు తిరిగి పొందటానికి ఏం చేయాలో తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం, మీరు ఏ యాప్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేస్తారో, వారికి ఫిర్యాదు చేయాలి. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో కూడా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.
• ముందుగా మీ మొబైల్ లో https://www.npci.org.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
• హోమ్ పేజీలో టాప్ రైట్‌లో ఉన్న Get in Touch పైన క్లిక్ చేసి UPI Complaint పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంప్లైంట్ సెక్షన్లో ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసి పర్సన్ టు పర్సన్ లేదా పర్సన్ టు మర్చంట్ ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇన్ కరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు అనథర్ అకౌంట్ అనే ఆప్షన్ పై సెలెక్ట్ చేసి మీ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కనుక చేస్తే మీ డబ్బు తిరిగి మీ అకౌంట్ లో పడుతుంది. ఇలా కూడా డబ్బు అందకపోతే వెంటనే మీ సమీప బ్యాంకుకు వెళ్లి అక్కడ అధికారులకు సంప్రదించాల్సి ఉంటుంది.