ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి మారిపోయాయి. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల కేవలం స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ఇంటి నుండి బయటకు అడుగుపెట్టకుండా లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. గతంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలన్న, డ్రా చేయడానికి అయినా తప్పనిసరిగా బ్యాంకు కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్లే అవసరం లేదు. అయితే ఈ టెక్నాలజీతో ఎంత సౌలభ్యం ఉందో అంత రిస్క్ కూడా ఉంది. ఆన్లైన్ ద్వారా కొన్నిసందర్భలలో ఒకరికి పంపాలనుకొని మరొకరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు.
ఇలాంటి ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాము. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్నవారు రాంగ్ యూపీఐ వల్ల ఒక అకౌంట్‌కు బదులు మరో అకౌంట్‌కు పొరపాటున డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే పొరపాటున ఇలా జరిగినప్పుడు ఆ డబ్బును ఎలా తిరిగి పొందాలో తెలియక చాలమంది నష్టపోతున్నారు. ఇలాంటి సందర్బంలో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు తిరిగి పొందటానికి ఏం చేయాలో తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం, డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా, పొరపాటుగా ఏవైనా లావాదేవీలు జరిపితే, బాధిత వ్యక్తి మొదట ఏ యాప్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేస్తారో, వారికి ఫిర్యాదు చేయాలి. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో కూడా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.
మనీ ట్రాన్స్‌ఫర్‌తో పాటు మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఎలా కంప్లైంట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
• ముందుగా మీ మొబైల్ లో https://www.npci.org.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
• హోమ్ పేజీలో టాప్ రైట్‌లో ఉన్న Get in Touch పైన క్లిక్ చేసి UPI Complaint పైన క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత Complaint సెక్షన్‌లో Transaction పైన క్లిక్ చేసి Person to Person లేదా Person to Merchant లలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
• ఆ తర్వాత Incorrectly transferred to another account ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి.
• ఇలా చేయటం వల్ల మీ డబ్బు తిరిగి పొందవచ్చు.
• ఒకవేళ ఇలా డబ్బు తిరిగి అందకపోతే దగ్గరలోని మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేయాలి.