ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే వాహనదారులు అందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆర్సి వంటి కొన్ని డాక్యుమెంట్స్ ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. లేకుంటే ట్రాఫిక్ పోలీసులు,రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు దొరికితే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా పోలీసుల ఆపి వాహనానికి సంబందించిన డాక్యుమెంట్స్ చూపించమంటే ఇంట్లో మరిచిపోయామని చెబుతు ఉంటారు. అయినప్పటికీ పోలిసులు విధించే జరిమానా కట్టక తప్పదు.
అయితే ఇలా పొరపాటున డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయినా కూడా చెల్లించకుండా ఉండటానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీసులు మీ బండిని ఆపి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అడిగితే మీ దగ్గర లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా కూడా ఒక్క యాప్ ఉంటే చాలు ఫైన్ కట్టకుండా అక్కడినుండి వెళ్ళవచ్చు. ఆ యాప్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. ‘Digi Locker’ అనే ఈ యాప్‌లో మీరు ముఖ్యమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటికి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు మీ వాహనాన్ని ఆపినట్లయితే.. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా.. ఈ డిజిలాకర్ యాప్‌లోని DL హార్డ్ కాపీని చూపిస్తే చాలు మీరు ఎలాంటి జరిమానా కట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపటానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను ఒకే చోట పొందేలా పలు యాప్ లను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది వాటిలో Digilocker, mParivahan మొబైల్ యాప్ ఒకటి.ఈ యాప్ ద్వారా మీకు సంబంధించిన అన్ని విలువైన డాక్యుమెంట్స్ సేవ్ చేసుకొని ఎక్కడికైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లవచ్చు.