Manchu Manoj: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి మంచు మనోజ్ కు చేదు అనుభవం… ఏం జరిగిందంటే?

Manchu Manoj: రాష్ట్రంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నించినా, ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. కొందరు దుండగులు ఆ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తమ వాహనాలకు స్టిక్కర్స్, ఎమ్మెల్యే, ఎంపీల పేరుతో బోర్డులు పెట్టుకొని, పన్నాగాలు పన్నుతున్నారు. ఇక మరి కొందరు ఇష్టా రీతిన యాక్సిడెంట్స్ చేస్తూ, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా తప్పించుకు తిరిగే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు తాజాగా టోలీచౌక్ లో పోలీసులు ఒక డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా ఫేక్ స్టిక్కర్స్, బ్లాక్ ఫిల్మ్ లు పెట్టుకున్న కార్లను, వివిధ వాహనాలను గుర్తించి, చలానాలు విధించారు.

ఇక పోతే అత్యంత పకడ్బందీగా పోలీసులు చేపట్టిన ఈ వాహన తనికీల్లో, పలువురు సెలబ్రిటీల వాహనాలు కూడా ఉండడం, ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటీవల హీరో కళ్యాణ్ రామ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కార్లు కూడా ఈ సోదాల్లో చిక్కడం చర్చనీయాశంగా మారింది. వారి కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి, అందరితో పాటుగా వారికీ రూ.700 జరిమానా విధించారు.

ఇక తాజాగా ఆ జాబితాలోకి మంచు మనోజ్ కూడా అందర్నీ ఆశ్చర్య పరిచారు. వేరే హీరోస్ కార్లు పట్టుబడ్డ సమయంలో వారు కార్లో లేరు. కానీ ఈ కార్లో మాత్రం స్వయంగా మనోజే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మీడియా కంట పడ్డారు. ఆయనకు కూడా అందరితో సమానంగా అతని కారు విండోస్ కు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి, రూ.700 ఫైన్ ను కట్టించుకున్నారు పోలీసులు. ఇంత స్ట్రిక్ట్ గా విధులు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ పోలీసులను నెటిజన్లు తమ కామెంట్స్ ద్వారా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.