సాధారణంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల బంధం ఎంతో విలువైనది. ఒకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే పది కాలాలపాటు ఆ బంధం ఎంతో గొప్పగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయినవారు తమ భార్యతో కాకుండా ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
ఒకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కొందరు పురుషులకు మెచ్యూరిటీ ఉండదు. ఇలా మెచ్యూరిటీ లేనివారు ఒకే మహిళతో కాకుండా ఇతర మహిళలతో సంబంధం పెట్టుకోనే అవకాశం ఉంది. లైఫ్ లో ఒక్కసారి రిలేషన్ షిప్ కి కమిట్ అయితే… ఎలా ఉండాలి అనే విషయం వారికి తెలీదు. అలాంటి వారు కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఇక భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవల వల్ల కూడా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.
దాంపత్య జీవితంలో తమ భార్య నుంచి తాము కోరుకున్నది లభించకపోయినా, భార్యతో సంతోషంగా లేకపోయిన ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి కనబరిస్తారు.ఇక దాంపత్య జీవితం రోజు ఒకే విధంగా సాగిన కూడా కొందరికి నచ్చదట దీంతో ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారని నిపుణులు చెబుతున్నారు.