సొంత భార్యపై బాడీ షేమింగ్ చేసిన నటుడు రణబీర్.. బుద్ధుందా అంటూ ఏకీపారేస్తున్న నెటిజన్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రణబీర్ కపూర్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరి వివాహమైన రెండు నెలలకి అలియా భట్ తాను గర్భవతి కాబోతున్నాననే విషయాన్ని బయట పెట్టారు. ఇక ఈమె గర్భవతి అని తెలియడంతో పెద్ద ఎత్తున తాను కమిట్ అయిన సినిమా షూటింగ్లను పూర్తి చేసి ప్రస్తుతం తాను నటించిన సినిమాలు విడుదల కు సిద్ధమవడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ తో కలిసి ఈమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ నాగార్జున వంటి తదితరులు కూడా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 9వ తేదీ విడుదల కావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ అలియా భట్ కి యాంకర్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది.మీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు కారణం ఏంటి అని ప్రశ్నించారు.

యాంకర్ ఈ విధంగా ప్రశ్న అడగడంతో వెంటనే రణబీర్ ఆలియా వైపు చూపిస్తూ మేమెందుకు పెద్దగా ప్రమోషన్ చేయలేదు అంటే కొందరు పెద్దగా బరువు పెరుగుతున్నారు అంటూ తన బేబీ బంప్ చూపిస్తూ కామెంట్ చేశారు. రణబీర్ ఒక్కసారిగా ఇలా అనడంతో అలియా షాక్ అవడంతో జస్ట్ జోక్ చేశా అంటూ రణబీర్ చెప్పారు. ఇక ఈ విషయంపై నేటిజన్స్ రణబీర్ కపూర్ ను ఏకిపారేస్తున్నారు.అసలు నీకు బుద్ధుందా వయసులో తనకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ మరి చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు. సొంత భార్య, ఒక ప్రెగ్నెంట్ లేడీని పట్టుకొని బాడీ షేమింగ్ చేస్తావా .. అది ఇలా పబ్లిక్ ప్లేస్ లో అంటూ పెద్ద ఎత్తున రణబీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.