బడా బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క!

అనుష్క ప్రస్తుత అగ్ర ప్రముహీరోయిన్ లలో ఒకరు. అనుష్క గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. అంతలా క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క. ఈమె 1971 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఈమె బెంగళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసింది. ఈమె అసలు పేరు స్వీటీ శెట్టి. కుటుంబ సభ్యులు సన్నిహితులు ఈమెను స్వీటీ అని ముద్దుగా పిలుస్తారు.2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమా తో సినీ రంగ ప్రవేశం చేశారు. భూమిక చావ్లా ను పెళ్లి చేసుకున్న యోగా నిపుణుడు భరత్ ఠాగూర్, అక్కినేని నాగార్జున ఈమెను సినీ రంగానికి పరిచయం చేశారు.

అనుష్క సినీ రంగంలో వరుస సినిమాలైన విక్రమార్కుడు, లక్ష్యం,అరుంధతి, డాన్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, మిర్చి, వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంది. అరుంధతి సినిమా ఈమెకు మంచి టర్నింగ్ పాయింట్. ఇక ఈమె నటించిన బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా విడుదల కావడం బ్లాక్ బాస్టర్ ఇంకా భారీ కలెక్షన్లు కూలగొట్టడం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలో దేవయాని గురించి అందరికీ తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాకు ఇంకా సినిమాలకు కాస్త దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈమె తన పెళ్లి గురించి ఆలోచిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయని సమాచారం. కొందరైతే దుబాయిలో ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగవచ్చని మరికొందరైతే బెంగళూరుకు చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగవచ్చని పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ 40 ఏళ్ల స్వీటీ పెళ్లి పీటలు ఎక్కబోతుందో లేదో వేచిచూడాలి మరి.