ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ యంత్రాల వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ వస్తువులు యంత్రాలలో లేకపోతే రోజు గడవదు. ఉదయం లేచిన దగ్గర నుండి గీజర్ , ఎలక్ట్రిక్ స్టౌ, టీవీ, ఏసీ, ఫ్యాన్ వంటి వాటిని ఉపయోగించక తప్పదు. అయితే కొన్ని సందర్భాలలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇవి కాలిపోతూ ఉంటాయి. అయితే ఇంట్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవకుండా కాపాడే స్మార్ట్ డివైజ్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ పరికరం పవర్ హై వోల్టేజ్/లో వోల్టేజ్ వచ్చిన సమయాల్లో మొత్తం ఇంట్లోని విద్యుత్ సరఫరానే నిలిపివేస్తుంది.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితంతో బిజీగా ఉంటున్నారు. దీంతో విద్యుత్ ఎక్కువ తక్కువ వచ్చినపుడు ఇంట్లోని వస్తువులు కాలిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువ. అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపేదే ‘స్మార్ట్ డివైజ్’. ఇది ఒక చిన్నపాటి పరికరం. మీ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా నియంత్రించడానికి ఈ పరికరాన్ని మీ ఇంట్లోకి పవర్ సరఫరా కంట్రోల్ చేసే బోర్డు వద్ద ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే.. సాధారణంగా ఇళ్లలోకి వచ్చే ఇన్ ఫుట్ సప్లై 230 వోల్ట్స్. దీనికి కొంచెం అటుగా.. ఇటుగా ఉంటే పర్లేదు. అదే 300 వోల్ట్స్ ధాటిపోయిందనుకోండి. ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిజ్ వంటి ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ కూడా ఐ వోల్టేజ్ వల్ల బాణాసంచాల్లా టపటపామని పేలతాయి. దీంతో మనం దానిని నియంత్రించ లేకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లుతుంది. ఇలా హై వోల్టేజ్ పవర్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే కాకుండా , లో వోల్టేజ్ వచ్చిన సందర్భాల్లోనూ ఇలానే జరుగుతూ ఉంటుంది. వీటి నుంచే రక్షించేదే.. స్మార్ట్ డివైజ్. ఈ డివైజ్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల పవర్ హెచ్చు తగ్గులు వచ్చినపుడు ఇంట్లోని మొత్తం కరెంటు సప్లైని నిలిపివేస్తుంది. దీని వల్ల వస్తువులు కాలిపోకుండా ఉంటాయి. ఇదే కాదు.. మనిషికి హానికరం అనిపించే ఏ పనినైనా ఆపుదల చేస్తుంది.