డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో భారీ సంఖ్య ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సంస్థ అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా డిసెంబర్ 31వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ షాప్ కీపర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 62 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ ఉద్యోగ ఖాళీలలో 45 జూనియర్ షాప్ కీపర్ పోస్టులు, 17 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆబ్జెక్టివ్ టైప్‌ రాతపరీక్ష, డిస్క్రిప్టివ్ టైప్ రాతపరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 81 వేల రూపాయల వేతనం లభిస్తుంది. dae.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.