చుండ్రు సమస్య ఎక్కువగా ఉందా..? వంటింటి చిట్కాలు ఇవే..!!

మనుషుల అందాన్ని, ఎదుటివాళ్లు మనల్ని అంచనా వేసే విషయంలో మన జుట్టు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పురుషుల హెయిర్ స్టయిల్స్, మహిళల జడలు అంతగా ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే.. అటువంటి అందానికి అడ్డంకిగా మారేది చుండ్రు సమస్య. దాదాపు అందరినీ చుండ్రు సమస్య వెంటాడుతుంది. ఇందుకు డక్టర్స్ సలహాలు, డాండ్రఫ్ షాంపూలు విరివిగా వాడుతూ ఉంటారు. అయినా.. అందరికీ ఈ విషయంలో డాండ్రఫ్ అంతగా తగ్గదు. దీంతో వారిలో నిరుత్సాహం పెరుగుతుంది. అయితే.. షాంపూల వాడకం, మందులు వేసుకోవడం కంటే కొన్ని ఇంటింటి చిట్కాలతో చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. వంటింటి పదార్థాలతోనే చండ్రు సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు.

  • కొబ్బరి నూనె తీసుకున్న మోతాదులోనే నిమ్మరసం తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని స్నానానికి ముందు తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాలపాటు జుట్టును ఆ మిశ్రమంతోనే ఉంచిన తర్వాత షాంపూతో స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చొప్పున ఇలా చేస్తే చండ్రు సమస్య తగ్గుతుంది. అయితే.. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించిన తర్వాత ఎక్కువసేపు కానీ.. రాత్రంతా కానీ ఉంచకూడదు.
  • మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచాలి. మరునాడు ఉదయం మెంతులను పేస్ట్ గా చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట ఆరనిచ్చిన తర్వాత స్నానం చేస్తే చండ్రు పోతుంది.
  • తలను నీటితో బాగా తడుపుకోవాలి. తర్వాత సన్నటి ఉప్పుతో తలను మర్ధన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చండ్రు పోతుంది.
  • ఉల్లిరసం, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొనను కలిపి మిశ్రమంగా చేయాలి. దానిని జుట్టులో కుదుళ్లకు పట్టేలా పట్టించి మర్దన చేయాలి. కాసేపటి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చండ్రు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

గమనిక: ఈ చిట్కాలన్నీ నిపుణులు ఆయా సందర్భాల్లో సూచించినవే ఇవ్వడం జరిగింది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి చుండ్రు నివారణకు తగిన పద్దతులు పాటించాలని కోరుతున్నాం.