మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ లో ఉన్న కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 117 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సూపర్‌వైజర్, టెక్నీషియన్, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
cnpnashik.spmcil.com అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ పరీక్షలోని మార్కుల ఆధారంగా నియామకాలను చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 112 ఉండగా సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. కళాకారుడు ఉద్యోగ ఖాళీ 1 ఉండగా సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలలో పోస్ట్ ఆధారంగా వయో పరిమితిలో మార్పులు ఉంటాయి. డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాసైన వాళ్లు సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేషన్-ప్రింటింగ్) ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
హిందీ లేదా ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు సూపర్‌వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 95,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది.