మనలో చాలామంది క్యారెట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. క్యారెట్ లలో సాధారణ క్యారెట్ తో పాటు బ్లాక్ క్యారెట్ కూడా అందుబాటులో ఉంటుంది. బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. బ్లాక్ క్యారెట్ లో బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీలలో ఉండే సహజ వర్ణ ద్రవ్యం ఉంటుందని చెప్పవచ్చు. బ్లాక్ క్యారెట్ లో ఉండే ఆంథోసైనిన్ లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయని చెప్పవచ్చు.
ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి శరీరానికి ఆరోగ్యం చేకూర్చే విషయంలో బ్లాక్ క్యారెట్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బ్లాక్ క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్లాక్ క్యారెట్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఈ డైటరీ ఫైబర్ ప్రేగులను సైతం ఒకింత ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. బ్లాక్ క్యారెట్ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుందని చెప్పవచ్చు. బ్లాక్ క్యారెట్ లను డైరెక్ట్ గా తీసుకోకుండా సలాడ్లు, స్మూతీలు, జ్యూసుల రూపంలో తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
బ్లాక్ క్యారెట్లలో ఆంథోసైనిన్, బీటా-కెరోటిన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే బ్లాక్ క్యారెట్లను మరీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు.