ఆ ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్నో లాభాలు.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది ఆల్కహాల్ పేరు వింటే తెగ టెన్షన్ పడతారు. ఆల్కహాల్ తాగడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామంది ఫీలవుతారు. మద్యపానం ఆరోగ్యానికి హాని చేస్తుందనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని రకాల మద్యం మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయని చెప్పవచ్చు. రెడ్ వైన్ తాగడం వల్ల శరీరానికి ఎంతో లాభం చేకూరుతుందని చెప్పవచ్చు.

రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండగా పరిమితంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. షాంపైన్ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ లభిస్తాయని చెప్పవచ్చు. దీనిని మితంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆగావే అనే మొక్క నుంచి టేకిలా అనే మద్యాన్ని తయారు చేస్తారు.

టేకిలాలో ఉండే ఫ్రక్టాన్లు ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. విస్కీ తాగడం వల్ల వాపు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడే ఛాన్స్ అయితే ఉంటుంది. జిన్ మితంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.

లైట్ బీర్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. మితంగా లైట్ బీర్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. పులియబెట్టిన బియ్యంతో తయారు చేసే సేక్ తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ కలుగుతాయి. ఆల్కహాల్ మితంగా తాగడం వల్ల మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది.