బొగ్గు మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. coal.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ప్రభుత్వ సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/మాస్టర్ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు 75000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ కమిటీ ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. సంబంధిత పత్రాలతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సక్రమంగా పూరించి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.
జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. బొగ్గు మంత్రిత్వ శాఖలో పని చేయాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.