China: ‘చైనా’నా మజాకా..! 28 గంటల్లో 10 అంతస్థుల భవనం కట్టేశారు..!

China: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’.. అని ఓ సామెత ఉన్నట్టు మనకు తెలిసిందే. ఇప్పుడు పెళ్లి విషయం పక్కనపెట్టి ఇల్లు కట్టడం అనే పాయింట్ కి వద్దాం. ఒక పాక కట్టాలంటేనే కోన్ని రోజులు పడుతుంది. కనీసం 100 గజాల్లో ఇల్లు కట్టాలన్నా.. నెలలు పడుతుంది. ఇక అపార్ట్ మెంట్ అయితే.. ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. కానీ.. చైనాలోని ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీ ‘బ్రాడ్ గ్రూప్’ మాత్రం 10 అంతస్థుల భవనమైనా.. ఒక్క రోజులోనే కట్టేస్తామని.. కట్టి చూపించింది. కేవలం 28 గంటల 45 నిముషాల్లో చాంగ్షా అనే నగరంలో ఓ అపార్ట్ మెంట్ కట్టేసింది.

2019 డిసెంబర్లో కరోనా ఆసుపత్రిని 15 రోజుల్లో కట్టేశారు. ఇప్పుడు అంతకుమించి చేశారు. కేవలం 28 గంటల 45 నిముషాల్లో పది అంతస్థుల అపార్ట్ మెంట్ ను కట్టేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ప్రీ ప్యాబ్రికేటెడ్ కన్ స్ట్రక్షన్’ అనే టెక్నాలజీ ఉపయోగించే అద్భుతం చేశారు. ఈ భవనాన్ని నిర్మించిన బోర్డు గ్రూపు.. ఇంత తక్కువ సమయంలో ఓ భవంతిని నిర్మించడం ఇదే తొలిసారని చెప్తోంది. భవనానికి కావాల్సిన్ శ్లాబులు, మాడ్యూల్స్ ను  ముందే చిన్న చిన్న యూనిట్లుగా సిద్ధం చేసుకుంది. మ్యాన్ పవర్ కూడా సిద్ధమయ్యాక.. ఒక్కోటిగా పేర్చుకుంటూ వెళ్లి బోల్టులు బిగించారు. విద్యుత్, నీరు.. సౌకర్యాలను కూడా ముందే రెడీ చేసుకున్నారు. అయితే.. ఇది చదివినంత తేలికేం కాదు.

మూడు భారీ క్రేన్లు, మ్యాన్ పవర్ అవసరమయ్యాయి. యూనిట్లను అమర్చే సమయంలో అజాగ్రత్తగా ఉంటే భవనం కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఒక్కరోజులో.. డేటు మారిన మరో అయిదు గంటల్లో భవనం పూర్తి చేసేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధంచిన వీడియోను బిల్డింగ్ కట్టిన సంస్థ యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.