Revanth Reddy: ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మహబూబ్ నగర్లో ప్రభుత్వం రైతు పండగ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం (శనివారం 30) రైతు పండగ ముగింపు వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ముఖ్యంగా లగచర్ల ఘటన గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడంగల్లో 1300 ఎకరాల భూమి తీసుకుంటే అది నా కోసమా..? నా సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేది నా తపన. రాష్ట్రంలో ఎవరు ప్రాజెక్టులు కట్టలేదా ఒకటి అభివృద్ధి చెందాలి అంటే మరొకరు నష్టపోవాల్సిందే ఇప్పుడు మీలాగా అప్పట్లో భూములు ఇవ్వము అని ఉంటే ఇప్పుడు శ్రీశైలం నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు వచ్చేవా అంటూ ప్రశ్నించారు.
కొంతమంది మాయగాల్ల మాటలను నమ్మి ప్రజలు భూమి ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు ఎవరు కూడా భూమి ఇవ్వడానికి అడ్డుపడొద్దు ఇలా భూసేకరణలో భాగంగా భూమి కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 20 లక్షల రూపాయలు పరిహారం ఇప్పించే బాధ్యత నాదని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి పాతికవేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాను.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ బాధితులు ఎంత బాధపడ్డారో హరీష్ రావుకు తెలియదా అని నిలదీశారు. పాలమూరు భూమిని పంచి పెడితే.. చరిత్ర నన్ను క్షమిస్తుందా..? ఈ ప్రాంత బిడ్డగా జిల్లాకు నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కొంతమంది మాటలను నమ్మి ఎవరు భూసేకరణకు అడ్డుపడుతూనే లగచర్ల గ్రామ రైతులు మాదిరిగా అరెస్టులు అయ్యి ఇబ్బంది పడొద్దు అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.