ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్!

ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలలో ఉద్యోగ ఖాళీల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఫ్రెషర్స్ కు ఉద్యోగ ఖాళీల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన క్యాప్ జెమిని నిరుద్యోగులకు అదిరిపొయే తీపికబురు అందించింది. వర్క్‌ఫ్రం హోమ్, ఎనీవేర్ జాబ్స్‌ భర్తీ దిశగా క్యాప్ జెమిని అడుగులు వేయడం గమనార్హం.

 

వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరగనుండగా డిగ్రీ పూర్తీ చేసి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఉద్యోగాలను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో భర్తీ చేయనుండటంతో వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ చేసేవాళ్లకు భారీగా బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఇతర ఐటీ కంపెనీలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తాయేమో చూడాలి.

 

క్యాప్ జెమిని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటి కాగా ఈ కంపెనీలో వేతనాలు సైతం భారీ స్థాయిలోనే ఉంటాయనే సంగతి తెలిసిందే. ఐటీ సంస్థలలో వేతనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. క్యాప్ జెమిని సంస్థలో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఉద్యోగుల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. క్యాప్‌జెమిని గ్లోబల్ వర్క్‌ఫోర్స్ 3,60,000 కావడం గమనార్హం.

 

క్యాప్ జెమిని సంస్థకు మన దేశంలోనే ఏకంగా 1,85,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొత్త టెక్నాలజీలను నేర్చుకునే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు రోజురోజుకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది.