పసుపు పచ్చ దంతాలతో నలుగురిలో మాట్లాడలేకపోతున్నారా… ఈ సింపుల్ చిట్కాతో సమస్యకు చూపెట్టండి!

సాధారణంగా మనం సరిగా బ్రష్ చేయకపోయినా లేదా నీటిలో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉన్నా కూడా పళ్ళు పసుపు పచ్చగా మారుతాయి. ఇలాపసుపుపచ్చ దంతాల కారణంగా చాలామంది నలుగురిలో స్వేచ్ఛగా నవ్వడానికి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఈ సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరు అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సింపుల్ చిట్కాతో మీ సమస్య నుంచి బయటపడి నలుగురిలో స్వేచ్ఛగా నవ్వవచ్చు.

ఒక గిన్నెలో అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా ఈ పేస్టుతో పది రోజులపాటు దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా పది రోజులపాటు ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేయటం వల్ల పళ్లపై ఏర్పడినటువంటి గార పసుపు మరకలు తొలగిపోయి తల తల మెరిసే తెల్లని దంతాలు మీ సొంతం అవుతాయి.

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా నోటిలో ఏర్పడినటువంటి బ్యాక్టీరియాలను తొలగించడానికి, నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి దోహదపడుతుంది. అలాగే ఉప్పు బేకింగ్ సోడా పళ్లపై ఉన్నటువంటి పసుపుపచ్చ మరకలు తొలగించి పళ్ళను తెల్లగా మారుస్తుంది. ఇలా ఈ సహజ చిట్కాలతో పది రోజులపాటు పళ్ళను తోమటం వల్ల నోటి సమస్యలతో పాటు పళ్ళు తెల్లగా మారుతాయి.ఈ చిట్కాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.