ప్రస్తుత కాలంలో చాలామంది పాదాలకు సంబంధించిన సమస్యలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాదాలపై పుండ్లు ఏర్పడటం వల్ల కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవాళ్లలో చాలామంది కాళ్లపై ఏర్పడే పుండ్ల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పాదాలపై పుండ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ప్రధానంగా పాదాలపై పుండ్ల సమస్యతో బాధ పడేవాళ్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటును సైతం అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. ధూమపానం, మద్యపానం అలవాట్ల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ అలవాట్లు ఉన్నవాళ్లు వెంటనే ఆ అలవాట్లను మార్చుకుంటే మంచిది.
కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం ద్వారా కూడా పాదాలపై పుండ్ల సమస్యను దూరం చేసుకోవచ్చు. సరైన రకం షూ, సాక్స్ లను వినియోగించడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయించుకోవడంతో పాటు డాక్టర్ ను కలిసి సలహాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్య దూరమవుతుంది.
ఎలాంటి గాయాలు లేకుండా గోళ్లను జాగ్రత్తగా కత్తిరించడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా తాత్కాలికంగా ఎన్నో ప్రయోజనాలు సొంతమవుతాయి. ఈ చిట్కాలతో పాటు పాదాల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.