బీటెక్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో 140 ఉద్యోగ ఖాళీలు!

Job-Vacancy

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 140 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

 

ఎంసీఏతో పాటు బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://careers.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు నోయిడాలో పని చేయాల్సి ఉంటుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 100 ఉంటే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 30, మిగతా ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి.

 

ఏప్రిల్ 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.