Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి శ్రీ లీల ఒకరు. ఈమె హీరోయిన్గా ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక శ్రీ లీల చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈమె తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు .
ఇలా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె పుష్ప 2 సినిమాలు మాత్రం కిస్సిక్ అనే పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి కుర్రకారులను ఓ ఊపు ఊపేశారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా శ్రీ లీల మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా చద్దన్నంలోకి గొడ్డు కారం కలుపుకొని తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో శ్రీలీల కారం పొడితో అన్నం తింటూ కనిపించింది. పల్లీ పొడి, వేడన్నం బెస్ట్ కాంబో అంటూ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినింది.
ఇలా చద్దన్నంలో కారం కలుపుకొని తినడం కోసం ఉదయం నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నాను అలాగే దీనిని తినడం కోసం పొద్దున నుంచి ఏమీ తినకుండా ఎదురుచూసినట్టు శ్రీ లీల తెలియ చేసారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.