కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారా… ఈ తప్పులు జరగకుండా చూసుకోండి?

సాధారణంగా మనం ఏదైనా కొత్త వస్తువును లేదా వాహనాలను ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. సరైన సమయం తేదీ చూసి నూతన వస్తువులను కొనుగోలు చేస్తుంటాము. అయితే మనం కలకాలం నివసించే ఇంటి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు మరిన్ని ముఖ్యం. ముఖ్యంగా ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ఈ తప్పులు ఏ మాత్రం చేయకూడదు. ఇంటి కొనుగోలు విషయంలో ముఖ్యంగా వాస్తు ఎంతో ముఖ్యమైనది.

ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఆ ఇంటి వాస్తు ఏ విధంగా ఉందనే విషయాలను పూర్తిగా గమనించి ఇంటిని కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇల్లు నిర్మించిన స్థానంలో ఏమి ఉండేదనే విషయాలను కూడా తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో అంటే ఏదైనా బావి వంటివి ఉండి వాటిని పూడ్చి వాటిపై ఇల్లు కడితే ఆ ఇల్లు నివసించడానికి ముఖ్యమైనది కాదు. ఆ ఇంటిలో నివసించడం వల్ల ఇంట్లో ఉన్నవారికి తరచూ ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.

అందుకే ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఇంటి గురించి ఆ స్థలం గురించి అన్ని తెలుసుకోవాలి అలాగే ఇంట్లో కిచెన్ సరైన స్థానంలో ఉందా లేదా అన్న విషయాలను కూడా గుర్తు పెట్టుకోవాలి. వాస్తు విషయంలో ఏమాత్రం పొరపాట్లు జరగకుండా అన్ని విషయాలను పరిగణలో తీసుకొని ఇంటిని కొనుగోలు చేసినప్పుడే ఆ ఇంట్లో ఉండడం వల్ల మనకు కూడా సకల సంతోషాలు, సర్వసంపదలు కూడా కలుగుతాయి లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.