3444 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అత్యంత భారీ వేతనంతో?

భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు తీపికబురు చెబుతూ భారీ జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి సర్వే ఇన్‌ఛార్జ్, సర్వేయర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా మొత్తం 3444 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

 

జులై నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

 

సర్వే ఇన్‌ఛార్జ్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 944 రూపాయలుగా ఉండగా సర్వేయర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 826 రూపాయలుగా ఉండనుంది. www.bharatiyapashupalan.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో సర్వేయర్ ఉద్యోగ ఖాళీలు 2870 ఉండగా మిగతా ఉద్యోగ ఖాళీలు 574 ఉన్నాయి.

 

సర్వేయర్ ఉద్యోగ ఖాళీలకు 20,000 రూపాయలు వేతనంగా ఉండగా మిగతా ఉద్యోగ ఖాళీలకు 24,000 రూపాయలు వేతనంగా ఉండనుందని తెలుస్తోంది. వరుఅ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.