మనలో చాలామంది కోరుకున్న ప్రతి కోరిక వెంటనే తీరాలని భావిస్తారు. అయితే ఒక స్వామి చెవిలో కోర్కెలు చెబితే ఆ కోర్కెలు కచ్చితంగా తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకు 1100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ఏకశిలామూర్తిగా శ్రీ లక్ష్మీగణపతిస్వామి దర్శనమిస్తారు. తూర్పు చాళుక్యుల కాలం నాటి ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
ప్రత్యేక పూజలు చేసి పనులను మొదలుపెడితే ఆ పనులు అనుకున్న విధంగా జరుగుతున్నాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ సాంప్రదాయాన్ని భక్తులు అప్పటినుంచి ఇప్పటివరకు పాటిస్తున్నారు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన స్వామి విగ్రహం 19వ శతాబ్దంలో పంట పొలాలలో బహిర్గతం కావడం జరిగింది. భక్తులు విగ్రహం దొరికిన చోటే మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు.
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 10 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది. స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉండటం
ఈ ఆలయం ప్రత్యేకత కాగా ఇక్కడి స్వామివారు భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా సుప్రసిద్ధుడు కావడం గమనార్హం. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల సమయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తారు.
ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎలాంటి కోరిక అయినా కచ్చితంగా తీరుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంకు ఆశించిన స్థాయిలో పాపులారిటీ లేదు కానీ పాపులారిటీ పెరిగితే భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.