పదో తరగతి పాసైన వాళ్లకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగం!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ ను కలిగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి 12 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. bel-india.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

పదో తరగతి పాసైన వాళ్ల కోసం హవాల్దార్ పోస్టుల జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయని సమాచారం. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలలో జనరల్ కేటగిరీలో 6 ఉద్యోగ ఖాళీలు ఉండగా మిగిలిన 6 ఉద్యోగ ఖాళీలు ఇతర కేటగిరీలలో ఉన్నాయి. అయితే అనుభవ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు గరిష్టంగా 43 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 5.11 లక్షల రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

 

కనీసం 20,000 రూపాయల నుంచి 79,000 రూపాయల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుందని తెలుస్తోంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం లభించనుంది. బెంగళూరులో నిర్వహించే రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.