మనలో చాలామంది తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని భావిస్తుంటారు. అయితే ప్రభుత్వ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నేషనల్ సేవింగ్స్ స్కీమ్ అత్యుత్తమమైన స్కీమ్స్ లో ఒకటి కాగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
పదవీ విరమణ తర్వాత ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందని చెప్పవచ్చు. కనీసం 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 7.1 శాతం వడ్డీ లభించనుందని సమాచారం అందుతోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లకు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్ లలో ఒకటైన ఈ స్కీమ్ పై 7.2 శాతం వడ్డీ రేటు లభిస్తుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ పేద ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ కు బెస్ట్ స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 8 శాతం రాబడి లభించనుందని సమాచారం అందుతోంది. 30 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.