తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్ని ఉపయోగాలో?

తిప్పతీగ సిటీలో ఉన్నవారికి తెలియకపోయినా, పల్లెటూరులో ఉండేవారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రకృతిలో మన చుట్టూ ఉండే మొక్కలలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి. వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు.

అలాంటి మొక్కల్లో ఒకటి ఈ తిప్పతీగ. ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగనిరోగత శక్తి పెరుగుతుంది. సీజన్లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. తిప్పతీగ లో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.

తిప్పతీగ ఆకులు పొడిగా చేసి కాస్త బెల్లంతో ఆహారంగా తీసుకుంటే అజీర్తి సమస్యలు దూరం అయ్యి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు దీని చూర్ణాన్ని ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, మానసిక ఆవేదనలతో బాధపడేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజు తీసుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుగా పనిచేస్తుంది.

జలుబు, దగ్గు, టాన్సిల్స్ లాంటి శ్వాసకోస సమస్యలు ఉన్నవారు ఈ చూర్ణంతో ఫలితం పొందవచ్చు. గోరువెచ్చని పాలలో కాస్త ఈ చూర్ణం వేసి, కొద్దిగా అల్లం రసం వేసి ప్రతిరోజు తీసుకున్నట్లయితే కీళ్ల నొప్పులు దాదాపుగా తగ్గిపోతాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు మాత్రమే కాకుండా వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా చేయ గుణాలు ఈ తిప్పతీగలు ఉన్నాయి.

ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి ఆవరణలో ఈ తిప్పతీగ ఉన్నట్లయితే ప్రతి చిన్నదానికి టాబ్లెట్లు, వైద్యుల అవసరం దాదాపుగా అవసరం ఉండదు. మన శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది