గుడి బయట చెప్పులు పోతే ఇంత దరిద్రమా.. అలాంటి పరిస్థితులు వస్తాయా?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో గుడి బయట చెప్పులు పోగొట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయి. గుడి బయట చెప్పులు పోతే దరిద్రం అని కొంతమంది భావిస్తే కచ్చితంగా మరి కొందరు అదృష్టం అని భావిస్తారు. అయితే జ్యోతిష్కులు మాత్రం చెప్పులు మిస్ అయితే అస్సలు బాధ పడొద్దని చెబుతున్నారు. మన దరిద్రం చాలావరకు తగ్గుతుందని జ్యోతిష్కులు వెల్లడిస్తున్నారు.

శనివారం రోజున చెప్పులు మిస్ అయితే మాత్రం ఆ వ్యక్తికి చెడు నుంచి విముక్తి లభిస్తుందని భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహం పాదాలలో నివశిస్తుంది. చెప్పులు మిస్ అయినా చెప్పులు దానం చేసినా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరికైనా శని దేవుని అనుగ్రహం ఉండాలంటే చెప్పులను దానం చేస్తే మంచిదని చెప్పవచ్చు.

శనివారం రోజున చెప్పులను ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినా మంచి జరుగుతుంది. శని దేవుడి ప్రభావం మనపై తగ్గడంతో పాటు సులభంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. అదే సమయంలో ఇతరులు వాడిన చెప్పులను మనం వాడటం సరికాదు. తిరుమల కొండపైకి పాదరక్షలతో ఎవరూ ఎక్కరని పండితులు చెబుతున్నారు. కాలికి చెప్పులు వేసుకుని నడిస్తే సుఖంతో నడిచినట్టేనని పండితులు వెల్లడించారు.

చెప్పులను మిస్ చేసుకుంటే శని పోయిందని గుర్తు పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆంజనేయుడిని పూజిస్తే శని ప్రభావం పోతుందని కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి. చెప్పులు పోగొట్టుకొని పోతే ఏ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. అయితే పదేపదే చెప్పులు పోగొట్టుకుంటూ ఉంటే చెప్పుల విషయంలోకొన్నిజాగ్రత్తలు తీసుకుంటే మంచిది.