తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు.. భారీ వేతనంతో పంచాయతీరాజ్‌ లో 740 ఉద్యోగాలు!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 740 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కార్ ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. 740 ఉద్యోగాలలో నాలుగు చీఫ్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి.

60 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు 12 సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలను 11 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అదే సమయంలో ఈ విభాగంలో ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు రానున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో 87 కార్యాలయాలను ప్రారంభించనున్నారని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. తెలంగాణ సర్కార్ వరుస జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తుండటం వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు జరుగుతోంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయనున్నారు. 2024 ఎన్నికలకు ముందు వరుస జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు పడుతున్నాయి.

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా మరిన్ని ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వరుస జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఈ ఏడాది జరగకపోవచ్చని కూడా వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.