మీ పిల్లలు ఫోన్ కు బానిస అయ్యారా… అయితే ఇలా చేయాల్సిందే!

phone-kids

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా పాలు పోదు.ముఖ్యంగా చిన్నపిల్లలు నిరంతరం ఫోనుకు బానిస అయ్యి ఫోను లేకపోతే కనీసం భోజనం కూడా చేయని పరిస్థితికి వెళ్లారు. భోజనం చేయాలన్న వారు నిద్రపోవాలన్నా కూడా తప్పనిసరిగా ఫోన్ పక్కన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పిల్లలు ఇలా ఫోన్ కి అడిక్ట్ కావడానికి గల కారణం పెద్దలే.చిన్నప్పుడు వారు భోజనం చేయాలని లేదా వాళ్ళు అల్లరి చేయకుండా ఉండడం కోసం వారి చేతిలో ఫోన్ పెట్టి మన పని మనం చేసుకుంటాము అయితే అదే వారికి అలవాటుగా మారి బానిసలుగా తయారయ్యారు.

 

ఇక కరోనా రావటం వల్ల ఆన్లైన్ క్లాసెస్ కూడా రావడంతో తప్పనిసరిగా పేరెంట్స్ కూడా పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఇలా పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారి ఉంటే ముందుగా మనం వారిని గట్టిగా అరవకుండా అసలు వాళ్ళు సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు అనే విషయాన్ని గమనించి మెల్లిమెల్లిగా వారిని సెల్ నుంచి డైవర్ట్ చేసుకోవాలి. పిల్లలు తరచూ సెల్ ఫోన్ చూస్తూ ఉంటే మానిటర్ టైం సెట్ చేసి పెట్టాలి. అదేవిధంగా వారిని సెల్ ఫోన్ నుంచి బయటకు తీసుకు రావడం కోసం మనం కూడా కొన్ని సమయాలలో సెల్ ఫోన్ పక్కన పెట్టడం మంచిది.

 

వారితో పాటు సరదాగా ఆడుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదా మీతో పాటు పిల్లలను వాకింగ్ తీసుకువెళ్లాలి. ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ లో పిల్లలను పాల్గొనేలా చేస్తే క్రమక్రమంగా సెల్ఫోన్ అలవాటు నుంచి బయటపడతారు.లేదా మనకు ఏదైనా వస్తువులు ఉపయోగపడితే వాటిని తీసుకురమ్మని చెప్పి పిల్లలను బయటికి పంపించాలి. ఈ విధంగా చేయటం వల్ల చిన్న పిల్లలను ఫోన్ నుంచి బయటకు తీసుకురావచ్చు. అలాకాకుండా వారి మా నాన్న వారిని వదిలేస్తే వారికి కంటి చూపు సమస్యతో పాటు , ఒబిసిటీ రావడం మెడ భాగం పట్టేయడం వినికిడి లోపం తలెత్తడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.