రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా.. ఆ సమస్యకు సులువుగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

మనలో చాలామంది హిమోగ్లోబిన్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల ఎక్కువమంది హిమోగ్లోబిన్ లోపం సమస్యతో బాధ పడుతున్నారు. అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హిమోగ్లోబిన్‌ మన రక్తంలో కనిపించే ప్రొటీన్‌ కాగా శరీరంలోకి ఆక్సిజన్ ను తీసుకెళ్లడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత వల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అలసట, హార్మోన్‌ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిస్సత్తువ, జుట్టు రాలటం, చర్మం పాలిపోవటం లాంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పవచ్చు. లివర్‌ సమస్యలు, థైరాయిడ్‌, తలసేమియా, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ఐరన్‌, విటమిన్‌ బీ12 పోషకం, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం, బ్లడ్‌ క్యాన్సర్‌ వల్ల హిమోగ్లోబిన్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. నిమ్మ, క్యాప్సికమ్‌, టమాటాలు, ద్రాక్ష, బెర్రీలు, నారింజ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతాయి. బీట్ రూట్, మునగాకు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ సులువుగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు తరచూ తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

అనీమియాతో బాధపడేవారిని కూడా ఈ సమస్య వేధిస్తుంది. యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్రకోలీ తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దానిమ్మ, ఖర్జూరం గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా కూడా రక్తహీనత సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ చిట్కాలు పాటిస్తే మంచిది.