కంటి అలర్జీలు, శ్వాస సమస్యలతో సతమతమవుతున్నారా… ఈ ఆకుకూరతో చెక్ పెట్టండి!

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే పొన్నగంటి కూర మొక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.పొన్నగంటి కూర మొక్క
అమరాంథేసి కుటుంబానికి చెందినది.ఈ మొక్క ఆకుల నుంచి తీసే నూనె ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పొన్నగంటి ఆకులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12,రైబోఫ్లెవిన్, బీటా కెరోటిన్,యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ మైక్రోబియల్ గుణాలు, కాల్షియం, ఐరన్, ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా లభిస్తాయి. కావున పొన్నగంటి ఆకులతో పప్పు, చెట్ని, ఫ్రై వంటివి తయారు చేసుకుని తింటే అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

తరచూ పొన్నగంటి ఆకుకూరను ఆహారంలో తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆకుల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఎక్కువగా ఉండి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది తద్వారా ప్రమాదకర రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కంటి చూపును కోల్పోయిన వారికి తిరిగి కంటి చూపును తెప్పించే అద్భుత అంతుచిక్కని ఔషధ గుణాలు పొన్నగంటి ఆకుల్లో ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.మొలల సమస్యతో బాధపడే వారికి పొన్నగంటి ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.

మధుమేహం సమస్యతో బాధపడేవారు తరచూ ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.శ్వాస కోశ వ్యాధులైన ఆస్తమా, ఉబ్బసం, బ్రాంకైటీస్‌ వంటి సమస్యలతో బాధపడేవారు పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా తేనెను కలుపుకొని సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.పొన్నగంటి తాజా ఆకుల రసంలో వెల్లుల్లి రసం కలుపుకొని సేవిస్తే పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.పొన్నగంటి ఆకుల్లో ఉండే అత్యధిక పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు ఒంట్లో చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్తప్రసరణ వ్యవస్థను పెంచుతుంది.